Share News

‘ఉపాధి’ పనుల పర్యవేక్షణకు అద్దెవాహనాలు

ABN , Publish Date - May 07 , 2026 | 05:17 AM

ఉపాధి హామీ పథకం పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులకు అద్దె వాహనాలు సమకూర్చాలని అన్ని జిల్లాల కలెక్టర్లను పంచాయతీరాజ్‌...

‘ఉపాధి’ పనుల పర్యవేక్షణకు అద్దెవాహనాలు

  • పీఆర్‌ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులకు అద్దె వాహనాలు సమకూర్చాలని అన్ని జిల్లాల కలెక్టర్లను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌ ఆదేశించారు. మండల స్థాయిలో పనులను పర్యవేక్షించే ఎంపీడీవోలు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్ల కోసం మే 1 నుంచి జూన్‌ 30 వరకు ఈ వాహనాలను అద్దెకు తీసుకునేందుకు అనుమతినిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.33,000 అద్దెగా నిర్ణయించామని, ఈ ఖర్చులకు ఉపాధి హామీ నిధులను మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని కమిషనర్‌ పేర్కొన్నారు. వాహనాన్ని పొందిన అధికారులు నెలలో కనీసం 20రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రతినెలా 5లోపు తమ పర్యటన వివరాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

Updated Date - May 07 , 2026 | 05:17 AM