Share News

నావలి రిజర్వాయర్‌కు ఒప్పుకోం

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:37 AM

తుంగభద్ర నదిపై నావలి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది..

నావలి రిజర్వాయర్‌కు ఒప్పుకోం

  • తుంగభద్ర బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిపై నావలి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. దీనివల్ల దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ప్రవాహంపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్‌) వి.రమేష్‌బాబు లేఖ రాశారు. అలాగే తుంగభద్ర 224వ బోర్డు మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్‌లో మార్పులు చేయాలని లేఖలో పేర్కొన్నారు. తుంగభద్ర జలాశయం గేట్లను 1500 మి.మీ మేర పెంచడాన్ని వ్యతిరేకించగా, ఈ అంశం మినిట్స్‌లో లేదని వివరించారు. కాగా, రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌) నుంచి ఈనెల 12 నుంచి 21వ తేదీ వరకు నీటి విడుదలపై తుంగభద్ర బోర్డుకు మరో లేఖ రాశారు. ఈ సమయంలో మొదటి ఐదు రోజులు రోజుకు 2,500 క్యూసెక్కులు, చివరి 5 రోజులు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కోరారు.

Updated Date - Feb 12 , 2026 | 02:37 AM