తెలంగాణ ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:38 AM
పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో నేరుగా ప్రవేశాలకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) విడుదల చేసింది.
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో నేరుగా ప్రవేశాలకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు వచ్చేనెల 29 లోపు దరఖాస్తు ఫారాలను తీసుకుని ఆగస్టు 29 లోపు సమర్పించాలని టాస్ డైరెక్టర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను అన్ని మీసేవ కేంద్రాల్లో సమర్పించవచ్చన్నారు.