పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలి
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:57 AM
సెప్టెంబర్ 1 2004 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమించిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్థరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సంజయ్ జాజుకు గ్రూప్ 1 అధికారుల..
ఇంటర్నెట్ విభాగం: సెప్టెంబర్ 1 2004 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమించిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్థరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సంజయ్ జాజుకు గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఉపాధ్యాయ, సచివాలయ ఉద్యోగులతో కలిసి గురువారం సచివాలయంలో వినతి పత్రం సమర్పించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్థరించినట్లు తెలంగాణలో కూడా పునరుద్ధరించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.