Share News

నర్సింగ్‌కు కేరాఫ్‌గా తెలంగాణ

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:07 AM

ఒకప్పుడు శిక్షణ పొందిన నర్సులు అంటే కేరళ గుర్తుకు వచ్చేదని, కానీ నేడు తెలంగాణ కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిందని యునైటెడ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాస్మిన్‌ షా పేర్కొన్నారు.

నర్సింగ్‌కు కేరాఫ్‌గా తెలంగాణ

  • 10వేలకు పైగా నర్సుల భర్తీకి నిర్ణయం

ఒకప్పుడు శిక్షణ పొందిన నర్సులు అంటే కేరళ గుర్తుకు వచ్చేదని, కానీ నేడు తెలంగాణ కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిందని యునైటెడ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాస్మిన్‌ షా పేర్కొన్నారు. అనేక రాష్ర్టాల్లో ఇప్పటికీ కాంట్రాక్ట్‌ విధానంలోనే నర్సులను నియమిస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగాలు భర్తీ చేయడం నిరుద్యోగులకు సదావకాశమని చెప్పారు. అలాగే టామ్‌కామ్‌ ద్వారా విదేశాల్లో కూడా నర్సులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షణీయమన్నారు. తెలంగాణప్రభుత్వం వేలాదిగా స్టాఫ్‌ నర్సుల భర్తీకి ఆమోదం తెలపడం ఎంతో సంతోషకరమని ఆల్‌ ఇండియా గవర్నమెంట్‌ నర్సెస్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ అనిత పన్వార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నర్సింగ్‌ విద్యకు విశేష ఆదరణ కల్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Updated Date - Jul 23 , 2026 | 06:09 AM