Share News

పెరుగుతోన్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:37 AM

రాష్ట్రంలో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ ఫ్యాన్లు, ఏసీలకు పని చెప్పాల్సి వస్తోంది.

పెరుగుతోన్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ ఫ్యాన్లు, ఏసీలకు పని చెప్పాల్సి వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు 14 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధారిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా నమోదైంది. ఇక హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 18.2 డిగ్రీలుగా నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15-19 మధ్య, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీల మధ ్య నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated Date - Jan 27 , 2026 | 03:37 AM