Share News

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

ABN , Publish Date - May 29 , 2026 | 03:24 AM

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గురువారం బక్రీద్‌ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

  • బక్రీద్‌ వేడుకల్లో ముస్లింల డిమాండ్‌

  • గోసంరక్షణకు అందరూ పాటుపడాలని పిలుపు .. ఫ్లెక్సీలు, ప్లకార్డుల ప్రదర్శన

కేసముద్రం, సిరిసిల్ల, మే 28 (ఆంధ్రజ్యోతి): ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గురువారం బక్రీద్‌ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మునిసిపాలిటీ పరిధిలోని ఈద్గా వద్ద ప్రార్థనల అనంతరం ముస్లింలు ఈ మేరకు బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ.. దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలంటే మతాలకు అతీతంగా గో సంరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. ‘హిందూ, ముస్లిం భాయీ భాయీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ముస్లింలు పాల్గొన్నారు. మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ ఇదే డిమాండ్‌ వ్యక్తమైంది. స్థానిక ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనల అనంతరం.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం మత పెద్దలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

Updated Date - May 29 , 2026 | 03:24 AM