నేడే పుర ప్రకటన!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:44 AM
పుర ఎన్నికల ప్రకటన మంగళవారం జారీ కానుందని పురపాలక శాఖ అధికారుల సమాచారం. అయితే ఎన్నికల ప్రకటనతోపాటే షెడ్యూల్ కూడా ప్రకటిస్తారా..
ప్రకటనతోపాటు షెడ్యూల్ కూడా..ఇస్తారా లేదా అన్న మీమాంసలో అధికారులు
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్ర జ్యోతి) : పుర ఎన్నికల ప్రకటన మంగళవారం జారీ కానుందని పురపాలక శాఖ అధికారుల సమాచారం. అయితే ఎన్నికల ప్రకటనతోపాటే షెడ్యూల్ కూడా ప్రకటిస్తారా.. లేదా అనే చర్చ అధికారుల్లో ఉంది. ఒక వేళ ప్రకటనతోపాటు షెడ్యూల్ కూడా ఇస్తే 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంటుందని అఽధికారవర్గాల సమాచారం. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి పండుగ ఉన్నందున ఆలోపే ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లకు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధంగా ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ క్షణంలో నిర్వహించినా యంత్రాంగమంతా సిద్ధంగా ఉందంటున్నారు.