మునిసిపల్ ఎన్నికల్లో 14 స్థానాలు ఏకగ్రీవం
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:34 AM
రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు సంబంధించిన 2,996 వార్డులు, డివిజన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వీటిలో ...
కాంగ్రెస్ ఖాతాలో 12, బీఆర్‌ఎస్ ఖాతాలో 2: ఎస్‌ఈసీ
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు సంబంధించిన 2,996 వార్డులు, డివిజన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వీటిలో 14 స్థానాలు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు 12 మంది, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇద్దరున్నట్లు పేర్కొంది. కాగా ఈ నెల 11న పోలింగ్ జరగనున్న 2,982 స్థానాల్లో ఆయా పార్టీల తరఫున పోటీచేస్తున్న వారితోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 12,944 మంది తలపడనున్నారు. ఎస్‌ఈసీ వివరాల ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ, బీఫారమ్‌ల సమర్పణ అనంతరం అధికార కాంగ్రెస్ తరఫున 2,948 మంది, బీజేపీ నుంచి 2,634 మంది, బీఆర్‌ఎస్ నుంచి 2,878 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆప్ నుంచి 98, బీఎ్‌సపీ నుంచి 213, సీపీఎం నుంచి 128, ఎంఐఎం నుంచి 282, ఏఐఎ్‌ఫబీ నుంచి 298, సీపీఐ నుంచి 169, ఐయూఎంఎల్ నుంచి 9, జేఎ్‌సపీ నుంచి 332, ఇతర పార్టీల నుంచి 240 మంది, స్వతంత్ర అభ్యర్థులు 2,786 మంది పోటీలో ఉన్నారు.