ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ లంచ్
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:38 AM
సన్నబియ్యం పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా శాసనసభ, మండలి సభ్యులకు అసెంబ్లీ లాంజ్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సన్నబియ్యంతో...
పాల్గొన్న సీఎం, ఉభయ సభాపతులు..
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా శాసనసభ, మండలి సభ్యులకు అసెంబ్లీ లాంజ్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సన్నబియ్యంతో లంచ్‌ను ఏర్పాటు చేశారు. మంత్రులు, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వారితో కలిసి భోజనం చేశారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో సీఎం చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. ఈ విందులో తాను బిర్యానీ తిన్నానని చెప్పారు.