Share News

రైతునేస్తం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: తుమ్మల

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:10 AM

రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతునేస్తం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ....

రైతునేస్తం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: తుమ్మల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతునేస్తం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని, రైతునేస్తం బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయం నుంచి మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రైతుల అవసరాలమేరకు.. అంశాలను ముందస్తుగానే నిర్ణయించాలని, వాటికి అనుగుణంగా అధికారులు సమాచారం, రైతుల అనుభవాలు, విజయగాథలను క్రోడీకరించి రైతులకు అవగాహన కల్పించాలని తుమ్మల ఆదేశించారు. యూరియా యాప్‌ పనితీరుపై రైతులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. గోపి, వివిధ జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 03:10 AM