రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని..పిల్లలు హామీ పత్రం ఇవ్వాలి: పొన్నం
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:11 AM
రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ప్రతిజ్ఞ హామీ పత్రం ఇవ్వాలని మంత్రి పొన్నం...
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ప్రతిజ్ఞ హామీ పత్రం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సచివాలయంలో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రతిజ్ఞ రాబోయే కాలంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో క్షేత్ర స్థాయిలో వాహనాలు ఉన్న వారందరి దగ్గరకు ఈ ప్రతిజ్ఞను తీసుకుపోవాలని, అధికారులు దీన్ని ఉద్యమంగా చేపట్టాలని ఆయన సూచించారు.