తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:21 AM
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని, త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘం వేస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
నిజామాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని, త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘం వేస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌ల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పొన్నం మాట్లాడారు. 2014లో ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్రంపై వివక్ష చూపుతోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల ఇంటి స్థలానికి సంబంధించి త్వరలోనే కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, తర్వాత అభివృదే లక్ష్యంగా పని చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారని, అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు.