త్వరలో ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు,శిక్షణ
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:22 AM
స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో...
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యమన్న మంత్రి జూపల్లి
హైదరాబాద్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అధికారులకు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇచ్చి త్వరలోనే ఆయుధాలను అప్పగిస్తామన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కానిేస్టబుల్ సౌమ్య బలిదానాన్ని వృథా పోనివ్వమని చెప్పారు.