Share News

ట్రిపుల్‌ టీ ఫార్ములాతో భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొంటాం

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:55 AM

రాబోయే రోజుల్లో పోలీసింగ్‌లో సవాళ్లను ‘ట్రిపుల్‌ టీ (టెక్నాలజీ, ట్రస్ట్‌, టాలెంట్‌)’ ఫార్ములాతో ఎదుర్కొంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

ట్రిపుల్‌ టీ ఫార్ములాతో భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొంటాం

  • నేరాలను అడ్డుకునేందుకు ప్రెడిక్టివ్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం

  • పోలీసు ఆఫీసర్స్‌ రీట్రీట్‌-2026లో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో పోలీసింగ్‌లో సవాళ్లను ‘ట్రిపుల్‌ టీ (టెక్నాలజీ, ట్రస్ట్‌, టాలెంట్‌)’ ఫార్ములాతో ఎదుర్కొంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేర పరిశోధనలో అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. ఆర్బీవీఆర్‌ఆర్‌ పోలీసు అకాడమీలో ఆదివారం జరిగిన పోలీసు ఉన్నతాధికారుల రిట్రీట్‌-2026 లో ఆయన ముఖ్య అతిఽధిగా మాట్లాడుతూ ప్రస్తుతం డీప్‌ఫేక్‌ వీడియోలు, వాయిస్‌ క్లోనింగ్‌, ఆటోమెటేడ్‌ ఫిషింగ్‌ స్కామ్‌లు పోలీసులకు పెను సవాళ్లు విసురుతున్నాయన్నారు. 2024లోనే సైబర్‌ నేరగాళ్లు రూ.22,845 కోట్లు కొల్లగొట్టారని, 2023తో పోలిస్తే ఇది 20ు ఎక్కువన్నారు. సైబర్‌ నేరాల బాధితుల్లో అక్షరాస్యులే అధికంగా ఉండటం ఆందోళనకరమన్నారు. ఈ పరిస్ధితుల్లో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్‌ రెడీనెస్‌, లీడర్‌షిప్‌, ఇన్నోవేషన్‌ కోలాబరేషన్‌, ఎఽథిక్స్‌తో కూడిన ఫ్యూచర్‌ రెడీ పోలీసింగ్‌ అవసరమన్నా రు. ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్డ్‌ పోలీసింగ్‌లో తెలంగాణ ముందు వరుసలోనే ఉందన్న శ్రీధర్‌బాబు.. మున్ముందు డేటా ఎనలిటిక్స్‌, ఏఐ లాంటి కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీ సాయంతో నేరాలు జరుగకమందే అడ్డుకునే ప్రెడెక్టివ్‌ పోలీసింగ్‌కు పెద్దపీట వేయనున్నామని తెలిపారు.

Updated Date - Mar 09 , 2026 | 03:55 AM