అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:58 AM
అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు.
ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తాం: అడ్లూరి లక్ష్మణ్
కవాడిగూడ, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమం అనే మూడు సూత్రాల ఆధారంగా అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ జిల్లాల నుంచి అంబేడ్కర్ వాదులు, దళిత గిరిజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరవుతారని, వారికోసం భోజనం, తాగునీరు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, మెడికల్ క్యాంపులు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.