Share News

20న మెడికల్‌ షాపుల బంద్‌

ABN , Publish Date - May 14 , 2026 | 04:25 AM

రాష్ట్రంలోని మెడికల్‌ షాపులు ఈ నెల 20న బంద్‌ పాటించనున్నాయి. అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం ....

20న మెడికల్‌ షాపుల బంద్‌

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మెడికల్‌ షాపులు ఈ నెల 20న బంద్‌ పాటించనున్నాయి. అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని మెడికల్‌ షాపులు, కొన్ని ఔషధ సరఫరా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్‌ కంపెనీల భారీ డిస్కౌంట్లను ఆపాలని, కల్తీ ఔషధాలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఓసీడీ 20న దేశవ్యాప్త సమ్మె చేపట్టనుంది. దీనికి మద్దతుగా రాష్ట్రంలోని మందులషాపుల యజమానులు, డీలర్లు బంద్‌ పాటించడానికి సిద్ధమయ్యారు. అత్యవసర మందులు కావాల్సిన వినియోగదారులు జాగ్రత్త పడితే బాగుంటుందన్న అభిప్రాయాలున్నాయి.

Updated Date - May 14 , 2026 | 04:25 AM