Share News

వైద్య కళాశాలల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్ల పదోన్నతులకు ఓకే

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:31 AM

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

వైద్య కళాశాలల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్ల పదోన్నతులకు ఓకే

  • ప్యానెల్‌ ఇయర్‌ నిబంధనను సడలించిన ప్రభుత్వం

  • 319 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు దక్కే చాన్స్‌

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హు లైన 319 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించేందుకు వీలుగా ప్యానెల్‌ ఇయర్‌ అర్హత నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జె. చోంగ్తు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం 2026-27, 2027-28 ప్యానెల్‌ ఇయర్‌ పరిధిలోకి వచ్చే 319 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లను ప్రస్తుత 2025-26 ప్యానెల్‌ ఇయర్‌లోనే పదోన్నతులకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. క్లినికల్‌, నాన్‌-క్లినికల్‌, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లోని అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ఈ అవకాశం దక్కనుంది.

Updated Date - Aug 05 , 2026 | 05:32 AM