తల్లిదండ్రుల గెంటివేతపై లోకాయుక్త సీరియస్
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:25 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేటీపీఎస్‌లో డీఈగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటివేసిన ఘటనపై తెలంగాణ లోకాయుక్త సుమోటోగా కేసును స్వీకరించింది.
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేటీపీఎస్‌లో డీఈగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటివేసిన ఘటనపై తెలంగాణ లోకాయుక్త సుమోటోగా కేసును స్వీకరించింది. లోకాయుక్త చట్టం-1983లోని సెక్షన్ 10(1)(ఎ)తో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌తో పాటు పాల్వంచ మండల తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. కేసుపై పూర్తిగా అవగాహన ఉన్న బాధ్యతాయుత అధికారిని విచారణకు నియమించి, పూర్తి వివరాలు, నివేదికలతో ఆగస్టు 3న వ్యక్తిగతంగా లోకాయుక్త ముందు హాజరుకావాలని ఆదేశించింది.