‘ఆంధ్రజ్యోతి’ కథనంపై లోకాయుక్త స్పందన
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:26 AM
ఆంధ్రజ్యోతి’ కథనంపై రాష్ట్ర లోకాయుక్త స్పందించింది. ‘‘లేని వైద్యులకు నెలనెలా జీతం’’ అనే శీర్షికన ఈ నెల 18న ప్రచురితమైన వార్తను సుమోటో ఫిర్యాదుగా స్వీకరించింది.
‘లేని వైద్యులకు జీతాల’పై సుమోటో విచారణ
హైదరాబాద్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై రాష్ట్ర లోకాయుక్త స్పందించింది. ‘‘లేని వైద్యులకు నెలనెలా జీతం’’ అనే శీర్షికన ఈ నెల 18న ప్రచురితమైన వార్తను సుమోటో ఫిర్యాదుగా స్వీకరించింది. తెలంగాణ లోకాయుక్త చట్టం-1983, ఉప లోకాయుక్త విచారణ చట్టం- 1984 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌తో పాటు మెదక్, పెద్దపల్లి, వికార్‌బాద్, నల్గొండ జిల్లాలకు చెందిన జిల్లా కోఆర్డినేటర్లు (హాస్పిటల్ సర్వీసె్‌స)కు ఈ నోటీసులు పంపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని, బాధ్యులైన అధికారులను గుర్తించి, తదుపరి విచారణ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.