Share News

తెలంగాణలో 26 లోక్‌సభ స్థానాలు?

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:40 AM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 26కు పెరుగుతాయని, వాటిలో ఎస్సీ కోటా కింద 4, ఎస్టీ కోటా కింద 2 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో 26 లోక్‌సభ స్థానాలు?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 26కు పెరుగుతాయని, వాటిలో ఎస్సీ కోటా కింద 4, ఎస్టీ కోటా కింద 2 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా పెరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఏంటనే అంశంపైనా రకరకాల ఊహాగానాలు చర్చకు వస్తున్నాయి. జహీరాబాద్‌ నియోజకవర్గం స్థానంలో సంగారెడ్డి పేరుతో ఏర్పాటు కావచ్చని అంటున్నారు. పార్లమెంట్‌లో పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం ఎన్నికల సంఘంతో సంప్రదించి డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమిస్తుంది. ఆ కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి.. నివేదిక ఇచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఏర్పాటు కాబోయే 26 లోక్‌సభ నియోజకవర్గాల పేర్లు..

1. ఆదిలాబాద్‌

2. మంచిర్యాల

3. నిజామాబాద్‌

4. జగిత్యాల/పెద్దపల్లి

5. కొత్తగూడెం/భద్రాచలం

6. వరంగల్‌

7. హనుమకొండ

8. కరీంనగర్‌

9. కామారెడ్డి

10. సంగారెడ్డి

11. మెదక్‌

12. భువనగిరి

13 మల్కాజిగిరి

14 కూకట్‌పల్లి/శేర్‌లింగంపల్లి

15 హైదరాబాద్‌

16 సికింద్రాబాద్‌

17 చార్మినార్‌

18 రంగారెడ్డి/పరిగి

19 వికారాబాద్‌ 20 చేవెళ్ల

21 మహబూబ్‌నగర్‌

22 నాగర్‌కర్నూల్‌

23 సూర్యాపేట

24 నల్గొండ 25 ఖమ్మం

26 నారాయణ్‌పేట/కొడంగల్‌

(ఎరుపు రంగులో ఉన్నవి కొత్తగా ఏర్పాటవుతాయని భావిస్తున్న లోక్‌సభ స్థానాలు)

Updated Date - Apr 17 , 2026 | 04:40 AM