మే నెలలో 95.25 లక్షల కేసుల మద్యం, బీర్ల విక్రయం
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:37 AM
రాష్ట్రంలో మే నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం మే నెలలో తెలంగాణ వ్యాప్తంగా 95,25,482 కేసుల మద్యం...
వీటి మొత్తం విలువ రూ.3,776కోట్లు
చివరి రెండు రోజుల్లోనే 464కోట్ల బిజినెస్
హైదరాబాద్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మే నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం మే నెలలో తెలంగాణ వ్యాప్తంగా 95,25,482 కేసుల మద్యం, బీర్లు అమ్ముడుపోయాయి. వీటి మొత్తం విలువ రూ.3,776కోట్లు. మే నెల చివరి రెండు రోజుల్లోనే 8.83లక్షల కేసులు అమ్ముడుపోయి రూ.464కోట్ల బిజినెస్ జరిగింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మేలో మద్యం అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనిపించిందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎండాకాలం కాబట్టి బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, వాతావరణం చల్లబడే వరకు అమ్మకాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, 1300కు పైగా బార్‌లు ఉన్నాయి.