Share News

Telangana Legal Services Authority: లీగల్‌ ఎయిడ్‌, అడ్వైస్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:28 AM

ప్రజలకు ఉచిత న్యాయంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో జరుగుతున్న 85వ ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ....

Telangana Legal Services Authority: లీగల్‌ ఎయిడ్‌, అడ్వైస్‌ సెంటర్‌ ఏర్పాటు

  • చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకే

  • తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఉచిత న్యాయంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో జరుగుతున్న 85వ ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ (నుమాయి్‌ష)లో తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ‘లీగల్‌ ఎయిడ్‌ అండ్‌ అడ్వైస్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి.సామ్‌ కోషీ ఎగ్జిబిషన్‌లోని స్టాల్‌ నంబర్‌ 1993, 1994 వద్ద ఈ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ప్రజలకు వివిధ చట్టాలు, న్యాయ సేవల అథారిటీ (నల్సా) పథకాలు, అవసరమైన వారికి అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించడమే ఈ కేంద్ర ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌ జరిగినన్ని రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్యానల్‌ అడ్వకేట్లు ఈ కేంద్రంలో సేవలందిస్తారని తెలిపారు.

Updated Date - Jan 09 , 2026 | 05:28 AM