భరోసా కేంద్రాల ఏర్పాటులో తెలంగాణదే మొదటిస్థానం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:43 AM
మహిళలు, బాలికల రక్షణ కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన...
డీజీపీ శివధర్‌రెడ్డి.. జనగామలో భరోసా, షీటీమ్ కేంద్రాల ప్రారంభం
జనగామ రూరల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికల రక్షణ కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రం, షీ టీమ్ సెంటర్‌ను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కొందరు కొన్ని విషయాలను పోలీసుస్టేషన్‌లో మనసు విప్పి చెప్పుకోలేరని, అలాం టి వారికి భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కేంద్రాల్లో సైకాలజిస్టులు, న్యాయవాదులు, డాక్టర్లు, సామాజికవేత్తలు ఉంటారని, వారు బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. జనగామలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం 34వదని, భరోసా కేంద్రాల ఏర్పాటులో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు షీ టీమ్‌లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, కవిత పాల్గొన్నారు.