శంకర్‌గౌడ్ బలవన్మరణం బాధాకరం: మహేశ్‌గౌడ్
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:47 AM
శంకర్ గౌడ్ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన బలవన్మరణం అత్యంత బాధాకరమని అన్నారు
ఇంటర్నెట్ డెస్క్: శంకర్ గౌడ్ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన బలవన్మరణం అత్యంత బాధాకరమని అన్నారు. సమస్యలు చర్చలతో పరిష్కరించుకోవాలని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా శంకర్‌గౌడ్ మృతిపట్ల మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తదితరులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. కొంత మంది స్వలాభం కోసం ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దంటూ ఉద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్యలపైన పార్లమెంటులో మాట్లాడటం చేతగాని కేంద్ర మంత్రి బండి సంజయ్.. శవాల వద్ద చిల్లర రాజకీయాలు చేయడంలో మాత్రం పోటీ పడుతున్నాడని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గౌడ్ విమర్శించారు.