ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవమే లక్ష్యం: అడ్లూరి
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:46 AM
సమాజంలో ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంభనతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ దృక్పథమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంభనతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ దృక్పథమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంప్‌సలో ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు సర్కారు చేపట్టిన 3 ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను శనివారం ఆయన ప్రారంభించారు. 50 మందికి కారు డ్రైవింగ్, ఎన్‌ఐటీహెచ్‌ఎం ద్వారా 25 మందికి హోటల్ మేనేజ్‌మెంట్-క్యాంటీన్ చెఫ్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ద్వారా 16 మందికి డ్రోన్ ఫైలట్ శిక్షణనందిస్తున్నట్లు మంత్రి అడ్లూరి తెలిపారు.