టెక్నాలజీతోనే సైబర్ నేరాలకు చెక్
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:20 AM
ప్రజాసేవలు, పాలన, కీలక మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సైబర్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి బలమైన విధానపరమైన సమన్వయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ...
షీల్డ్-26 సదస్సులో సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రజాసేవలు, పాలన, కీలక మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సైబర్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి బలమైన విధానపరమైన సమన్వయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు అన్నారు. సైబర్ నేరగాళ్లు సాంకేతికతను వాడుకుని నేరాలకు పాల్పడుతున్నారని, అదే సాంకేతికతతో వారి ఆట కట్టించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసిన ‘సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ షీల్డ్ -2026’ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సైబర్ భద్రతను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైం కేసుల దర్యాప్తు, స్పందన, ఎన్‌ఫోర్స్‌మెంట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అధునాతన సాంకేతికతలు అవసరమని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరు అద్భుతంగా ఉందని అభినందించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులే ఉంటున్నారన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్ట్‌పలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారానికి షీల్ట్-2026 జాతీయ వేదికగా నిలుస్తోందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ తెలిపారు.