Share News

ఆపరేషన్‌ పెద్దపులి!

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:54 AM

యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల సరిహద్దుల్లో ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి జాడ గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

ఆపరేషన్‌ పెద్దపులి!

  • ప్రత్యేక సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసిన అటవీశాఖ

హైదరాబాద్‌, ఆలేరు రూరల్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల సరిహద్దుల్లో ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి జాడ గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల మేరకు పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి(పీసీసీఎఫ్‌) సువర్ణ అధ్యక్షతన అరణ్యభవన్‌లో బుధవారం అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. కాగా, భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట దర్గా సమీపంలో పెద్ద పులి దాడిలో ఓ ఆవు మృతి చెందింది.

Updated Date - Feb 05 , 2026 | 03:54 AM