Share News

ఫోన్‌లోనే బస్‌ పాస్‌లు

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:13 AM

ప్రయాణికులకు టీజీఎ్‌సఆర్టీసీ సరికొత్త డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బస్‌ పాస్‌ కోసం గంటల తరబడి డిపోలవద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.......

ఫోన్‌లోనే బస్‌ పాస్‌లు

  • ‘మీటికెట్‌’ యాప్‌తో రెండు నిమిషాల్లోనే పాస్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ సరికొత్త డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బస్‌ పాస్‌ కోసం గంటల తరబడి డిపోలవద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, మీ-సేవ రూపొందించిన ‘మీటికెట్‌’ యాప్‌ ద్వారానే నేరుగా పాస్‌లను పొందే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ మొబైల్‌ యాప్‌ ద్వారా బస్‌ పాస్‌లు జారీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం విశేషం. ఈ విధానం వల్ల ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవడం, ఫీజు చెల్లించడం, డిజిటల్‌ పాస్‌ను పొందడం వంటి ప్రక్రియలను కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా మీటికెట్‌ యాప్‌ ద్వారా పాస్‌ తీసుకునే వారికి ఎలాంటి అదనపు బుకింగ్‌ చార్జీలు ఉండవని అధికారులు తెలిపారు. ఈ పాస్‌లలో డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌, లైవ్‌ వాలిడిటీ సూచిక, స్ర్కీన్‌షాట్లను నిరోఽధించే భద్రతా వ్యవస్థలు ఉండడం వల్ల దుర్వినియోగానికి తావుండదు. కండక్టర్లు వీటిని స్కాన్‌ చేసి ధ్రువీకరించకోవచ్చు. అంతేకాకుండా పాత పాస్‌లను సులభంగా రీన్యువల్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

Updated Date - Feb 28 , 2026 | 06:05 AM