రాష్ట్రంలో 2 ఎమ్‌వీ సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:42 AM
తెలంగాణలో పీఎం- కుసుమ్ పథకం కింద తొలి ‘రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్’ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో నిర్మాణం పూర్తి చేసుకుని గ్రిడ్‌కు అనుసంధానం అయ్యింది.
సిరిసిల్ల, జనవరి 24 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణలో పీఎం- కుసుమ్ పథకం కింద తొలి ‘రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్’ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో నిర్మాణం పూర్తి చేసుకుని గ్రిడ్‌కు అనుసంధానం అయ్యింది. శనివారం సాయంత్రం ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు సమీప 33/11 కేవీ ధర్మారం సబ్‌స్టేషన్ వద్ద గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎస్‌ఈ రమేశ్‌బాబు మాట్లాడుతూ.. రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం- కుసుమ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.