Share News

రాష్ట్రంలో తొలిసారిగా బాలిక తాత్కాలిక దత్తత

ABN , Publish Date - May 01 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో తొలిసారి ఫోస్టర్‌ కేర్‌ (తాత్కాలిక దత్తత) ఇచ్చిన జిల్లాగా నిజామాబాద్‌ నిలిచింది. కుటుంబానికి దూరమైన/నిర్లక్ష్యానికి గురైన/దుర్బలమైన ఆరేళ్లకు పైబడిన బాలబాలికలను ...

రాష్ట్రంలో తొలిసారిగా బాలిక తాత్కాలిక దత్తత

  • మంత్రి సీతక్క సమక్షంలో అప్పగింత

సుభా్‌షనగర్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిసారి ఫోస్టర్‌ కేర్‌ (తాత్కాలిక దత్తత) ఇచ్చిన జిల్లాగా నిజామాబాద్‌ నిలిచింది. కుటుంబానికి దూరమైన/నిర్లక్ష్యానికి గురైన/దుర్బలమైన ఆరేళ్లకు పైబడిన బాలబాలికలను రెండేళ్ల పాటు దత్తతకు ఇవ్వడం, తదుపరి వారికి నచ్చితేనే ఆ కుటుంబంతో కలిసి ఉండేలా చేయడమే దీని ఉద్దేశం. జిల్లా మహిళ శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్‌ల ఆధ్వర్యంలో గురువారం మంత్రి సీతక్క చేతుల మీదుగా ఓ బాలికను ఫోస్టర్‌ కేర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆరేళ్లకు పైబడిన పిల్లలను దత్తత ప్రక్రియలో భాగం చేయాలని, అలాగే దత్తతకు వెళ్లలేని ఇదే వయసు పిల్లలకు కుటుంబ వాతావరణం కల్పించేవిధంగా ఫోస్టర్‌ కేర్‌కు ఇవ్వాలని అన్నారు. ఫోస్టర్‌ కేర్‌ తీసుకోడానికి కుటుంబాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు.

Updated Date - May 01 , 2026 | 05:23 AM