Share News

అన్నింటికీ డయల్‌ 112

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:12 AM

అంబులెన్స్‌, పోలీసు, అగ్నిమాపక సేవలు.. ఇకపై అన్నింటికీ ఒకే ఫోన్‌ నంబర్‌. అదే.. డయల్‌ 112. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ బుధవారం ఈ సేవలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రారంభించనున్నారు.

అన్నింటికీ డయల్‌ 112

  • అంబులెన్స్‌, పోలీసు, అగ్నిమాపక సేవలకు ఒకే నంబరు

  • నేడు ప్రారంభించనున్న డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అంబులెన్స్‌, పోలీసు, అగ్నిమాపక సేవలు.. ఇకపై అన్నింటికీ ఒకే ఫోన్‌ నంబర్‌. అదే.. డయల్‌ 112. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ బుధవారం ఈ సేవలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న అత్యవసర స్పందన వ్యవస్థలన్నింటినీ దీనిద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్టు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ డైరక్టర్‌ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, గొడవలు, దోపిడీలు, వేధింపుల వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే వెంటనే సహాయం లభిస్తుందని ఆయన వివరించారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా కాల్‌మానిటరింగ్‌ చేస్తామని.. ఈ నంబర్‌కు కాల్‌ వచ్చిన వెంటనే కాలర్‌ లొకేషన్‌ సమాచారాన్ని సమీప పోలీసు బృందాలకు చేరవేస్తామని తెలిపారు. అవసరమైతే ఇతర అత్యవసర స్పందన వ్యవస్ధలతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 05:13 AM