Share News

భూముల మార్కెట్‌ విలువ పెంపుతో సామాన్యులపై భారం: రాంచందర్‌రావు

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:41 AM

భూముల మార్కెట్‌ విలువను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని...

భూముల మార్కెట్‌ విలువ పెంపుతో సామాన్యులపై భారం: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): భూముల మార్కెట్‌ విలువను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. సామాన్యుడు భూమి కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా రిజిస్ట్రేషన్‌ ఫీజుల కోసమే లక్షలాది రూపాయలు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ‘గ్రామీణ రైతులకు, భూ యజమానులకు న్యాయబద్ధంగా లబ్ధి చేకూరడాన్ని మేము స్వాగతిస్తాం. కానీ, ప్రస్తుత మార్కెట్‌ విలువల పెంపు వెనుక కాంగ్రెస్‌ ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు మేలు చేయడం కాదు.. కేవలం రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే’ అని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. పెంచిన భూముల మార్కెట్‌ విలువల వల్ల సామాన్యులపై పడే రిజిస్ట్రేషన్‌ చార్జీల భారాన్ని సమీక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 06 , 2026 | 04:41 AM