Share News

కార్మిక వేతనాలు శాస్త్రీయంగా ఉండాలి

ABN , Publish Date - May 12 , 2026 | 04:27 AM

రాష్ట్రంలో కార్మిక వేతనాల సవరణ శాస్ర్తీయంగా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

కార్మిక వేతనాలు శాస్త్రీయంగా ఉండాలి

  • సబ్‌ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, మే 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కార్మిక వేతనాల సవరణ శాస్ర్తీయంగా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న కనీస వేతన విధానాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన ‘లేబర్‌ కోడ్‌’లోని అంశాల ప్రభావం ఎలా ఉండబోతోందనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మిక వేతనాలను వారి వాస్తవ అవసరాలకు అనుగుణంగా సవరించాలని కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు ఉండాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని భట్టి తెలిపారు.

Updated Date - May 12 , 2026 | 04:27 AM