Share News

పసుపును ఆహార పంటగా గుర్తించండి: కవిత

ABN , Publish Date - May 02 , 2026 | 05:24 AM

పసుపును ఆహార పంటగా గుర్తించి క్వింటాల్‌కు రూ.16వేల మద్దతుధర ప్రకటించాలని తెలంగాణ రక్షణ ేసన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

పసుపును ఆహార పంటగా గుర్తించండి: కవిత

  • తెలంగాణ రక్షణ సేనలో చేరనున్న మాజీ మంత్రి బోడ జనార్దన్‌

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి) : పసుపును ఆహార పంటగా గుర్తించి క్వింటాల్‌కు రూ.16వేల మద్దతుధర ప్రకటించాలని తెలంగాణ రక్షణ ేసన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ కు చేరువలో మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో క్వింటాల్‌ పసుపును రూ.17వేలకు కొంటున్నారని తెలిపారు. నిజామాబాద్‌ మార్కెట్‌లో మాత్రం వ్యాపారులు సిండికేట్‌గామారి రూ.13వేలకు మించనీయడం లేదన్నారు. స్పైసెస్‌ బోర్డును బలోపేతంచేసి నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లోని పసుపు రైతులకు అండగా నిలవాలని కోరారు. కాగా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా తెలంగాణ రక్షణ సేన పార్టీలో మాజీ మంత్రి బోడ జనార్దన్‌ చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన కవితతో భేటీ అయ్యారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్‌ఎ్‌సను బలోపేతం చేసేందుకు కృషిచేస్తానన్నారు. ప్రస్తుత మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి తెదేపా అభ్యర్థిగా బోడ జనార్దన్‌ వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు.

Updated Date - May 02 , 2026 | 05:24 AM