బీఈఎస్‌ఎస్ టెండర్ల గడువు 9వరకు పొడిగింపు
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:38 AM
1500 మెగావాట్ల కరెంట్‌ను అందించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(బీఈఎస్‌ఎస్) టెండర్ల గడువును ఈ నెల 9 వరకు పొడిగిస్తూ తెలంగాణ జెన్‌కో నిర్ణయం తీసుకుంది. మహేశ్వరంలోని 400/220 కేవీ సబ్‌స్టేషన్‌లో...
తెలంగాణ జెన్‌కో నిర్ణయం
1500 మెగావాట్ల కరెంట్‌ను అందించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(బీఈఎస్‌ఎస్) టెండర్ల గడువును ఈ నెల 9 వరకు పొడిగిస్తూ తెలంగాణ జెన్‌కో నిర్ణయం తీసుకుంది. మహేశ్వరంలోని 400/220 కేవీ సబ్‌స్టేషన్‌లో 750 మెగావాట్ల ప్లాంట్‌ను, చౌటుప్పల్‌లోని 440/220 కేవీ సబ్‌స్టేషన్‌లో మరో 750 మెగావాట్ల ప్లాంట్‌ను ఈ స్టోరేజీ సిస్టమ్‌లో భాగంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బిల్ట్, ఓన్, ఆపరేట్ విధానం ప్రకారం వీటి నిర్వహణ ఉంటుంది. మరోవైపు శంకర్‌పల్లిలో కూడా 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వర్క్ ఆర్డర్ ఇంకా జారీ చేయలేదు. సౌర విద్యుత్ ఉత్పత్తి జరిగేటప్పుడు తక్కువ ధరకు కరెంట్ లభించే సమయంలో ఓపెన్ యాక్సెస్ నుంచి కొనుగోలు చేసి, బ్యాటరీల్లో నిల్వ చేయాలని, డిమాండ్ ఉన్నప్పుడు విక్రయించాలన్నది ప్రణాళిక. ఈ ప్లాంట్ నుంచి యూనిట్ కరెంటు రూ.2.90లకే లభిస్తుందని, తద్వారా డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో అఽధిక ధరకు కరెంట్ కొనుగోలు చేయాల్సిన ఒత్తిడి నుంచి బయటపడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. శంకర్‌పల్లి, మహేశ్వరం, చౌటుప్పల్‌లోని బ్యాటరీ స్టోరేజీ యూనిట్ల నిర్మాణం పూర్తయితే ఈ రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుంది.