Share News

తాత్కాలిక ఉద్యోగులకొనసాగింపుపై మార్గదర్శకాలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:38 AM

ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం, గెస్ట్‌, గంటల ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగుల కొనసాగింపుపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ....

తాత్కాలిక ఉద్యోగులకొనసాగింపుపై మార్గదర్శకాలు

  • 2026-27లో ఐఎ్‌ఫఎంఐఎస్‌ పోర్టల్‌ ద్వారానే అనుమతులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం, గెస్ట్‌, గంటల ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగుల కొనసాగింపుపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ సేవలను కొనసాగించాలంటే తప్పనిసరిగా ఐఎ్‌ఫఎంఐఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్షర్మేషన్‌ సిస్టమ్‌) పోర్టల్‌ ద్వారానే ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ బుధవారం సర్క్యులర్‌ జారీ చేసింది. కొత్త సేవలు, రాటిఫికేషన్‌ ప్రతిపాదనలను మాత్రం ప్రస్తుత విధానంలోనే ఈ ఫైల్‌ ద్వారా పంపాలని సూచించింది. ‘‘సంబంధిత విభాగం హెచ్‌వోడీ గత ఏడాది డేటాను ఆధారంగా చేసుకుని ఉద్యోగి కొనసాగింపు వివరాలను శాఖాధిపతికి పంపాలి. ఆ వివరాలను శాఖాధిపతి ఆర్థిక శాఖకు పంపుతారు. ఆర్థిక శాఖ పరిశీలన అనంతరం జీవో జారీ చేస్తారు. దీని వల్ల తాత్కాలిక ఉద్యోగుల వివరాలు నమోదులో పొరపాట్లకు తావు ఉండదు’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విధానంలో అనధికారిక నియామకాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపింది. కాగా, ఈ ఏడాది కూడా ఏజెన్సీల ద్వారానే తాత్కాలిక ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందని తాజా ఉత్తర్వులతో స్పష్టమైంది.

Updated Date - Feb 19 , 2026 | 04:38 AM