Share News

ఏడాదికి నాలుగు విడతల్లో విద్యార్థుల ఖాతాలోకి నగదు

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:04 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో-7ను ఉపసంహరించకుంది. దాని స్థానంలో జీవో-8 విడుదల చేసింది.

ఏడాదికి నాలుగు విడతల్లో విద్యార్థుల ఖాతాలోకి నగదు

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం

  • హైకోర్టు స్టేతో జీవో 7 వెనక్కి.. జీవో 8 జారీ

హైదరాబాద్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో-7ను ఉపసంహరించకుంది. దాని స్థానంలో జీవో-8 విడుదల చేసింది. ఫీజు సొమ్మును ఏడాదికి 4 విడతల్లో విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని అందులో పేర్కొంది. గత ఐదేళ్లుగా ప్రభుత్వం రూ.8 వేల కోట్ల నిధులు విడుదల చేయకపోవడంపై కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు గతంలో హైకోర్టును ఆశ్ర యించాయి. ప్రభుత్వం చెల్లించకుంటే ఫీజులను విద్యార్థుల నుంచి వసూ లు చేసుకునేందుకు అనుమతించాలని కోరాయి. దీనిపై కోర్టు ప్రభుత్వ వివరణ కోరగా జీవో-7విడుదల చేసింది. పాత బకాయిలు విడతలవారీగా చెల్లిస్తామని, విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజు వసూలు చేసుకునేందుకు అనుమతించబోమని అందులో తెలిపింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం చెల్లించనప్పుడు విద్యార్థుల నుంచి కాలేజీలను వసూలు ఎందుకు చేసు కోనివ్వరని ప్రశ్నించింది. జీవో-7పై గత నెలలో హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత కొద్ది రోజులుగా చర్చిస్తోంది. ఈనెల 24న తుది విచారణ జరగనున్న నేపథ్యంలో హైకోర్టు స్టే విధించిన జీవో-7ను ఉపసంహరిస్తూ జీవో-8 విడుదల చేసింది. అలా గే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ అమలుపై మార్గదర్శకాలు విడుదల చేస్తూ జీవో-9విడుదల చేసింది. ఇందులోనూ కాలేజీలు ఫీజు వసూలు చేసుకునే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జీవో-7లో పేర్కొన్నట్లు ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వేస్తామని ఇందులో నూ పేర్కొంది. ప్రభుత్వం నుంచి వచ్చిన రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని విద్యార్థులు తప్పనిసరిగా వారంలోపు కాలేజీలకు చెల్లించాలని, అలా చెల్లించని విద్యార్థుల తల్లిదండ్రులపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేస్తామని తెలిపింది. కొత్త జీవోలపై తెలంగాణ ప్రైవేటు కాలేజీ ల యాజమాన్యాల సమాఖ్య (ఫాతి) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా బకాయిలు చెల్లించని ప్రభుత్వం ఏడాదికి నాలుగు విడతలుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఫాతి సెక్రటరీ జనరల్‌ రవికుమార్‌ అన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని, పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఫాతి డిమాండ్‌ చేసింది.

Updated Date - Jun 10 , 2026 | 05:04 AM