వరంగల్ పోలీస్ కమిషనర్‌గా శ్వేత
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:31 AM
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నార్త్‌రేంజ్ శాంతిభద్రతల...
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‍ల బదిలీ
22 మంది నాన్ కేడర్ ఎస్పీలు కూడా
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నార్త్‌రేంజ్ శాంతిభద్రతల జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఆమెను ప్రభుత్వం వరంగల్ సీపీగా బదిలీ చేసి, భద్రాద్రి జోన్-4 డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ స్థానంలో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం విజయ్‌కుమార్‌ను నియమించింది. వరంగల్ సీపీగా పనిచేస్తున్న సన్‌ప్రీత్‌సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేసి, సిరిసిల్ల జోన్-3 డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ఐపీఎస్‍లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీగా ఉన్న డీఐజీ పోస్టుల్లో సీనియర్ ఐపీఎ్‌సలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝాకు కాళేశ్వరం జోన్-1 డీఐజీగా, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయెల్ డేవిస్‌కు యాదాద్రి జోన్-5 డీఐజీగా, సీఐ సెల్ డీఐజీ ఆర్. భాస్కరన్‌కు జోన్-2 (బాసర) డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్ సింధు శర్మను సీఐ సెల్ ఎస్పీగా బదిలీ చేసి, ఎస్‌ఐబీ ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్‌ఐబీ ఎస్పీగా ఉన్న వై.సాయిశేఖర్‌ను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సీహెచ్. ప్రవీణ్ కుమార్‌ను సీఐడీ ఎస్పీగా నియమించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 22 మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖాగోయల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న జి.బస్వారెడ్డిని విజిలెన్స్ అడిషనల్ ఎస్పీగా నియమించారు.
ఐపీఎస్‍ల బదిలీ
అటవీశాఖలో పనిచేస్తున్న 15 మంది ఐఎఫ్ఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్నవారితో పాటు ఇటీవల ఐఎ్‌ఫఎస్‌గా పదోన్నతి పొందిన వారికీ పోస్టింగులు లభించాయి.