Share News

క్రిస్టియన్ల ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jul 03 , 2026 | 07:13 AM

క్రిస్టియన్ల ఆర్థిక తోడ్పాటు పథకానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అర్హులైన క్రిస్టియన్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్‌..

క్రిస్టియన్ల ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): క్రిస్టియన్ల ఆర్థిక తోడ్పాటు పథకానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అర్హులైన క్రిస్టియన్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్‌ (మైనార్టీస్‌) ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.సబిత తెలిపారు. ఈ పథకం కింద చిన్న వ్యాపార యూనిట్లకు ఆర్థికసాయంతో పాటు, కుట్టుమెషీన్లు, ఈ-బైక్‌, ఈ-స్కూటీ, మోటార్‌ బైక్‌ యూనిట్లు అందించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.2లక్షలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల్లోపు ఉన్నవారు అర్హులని అధికారులు తెలిపారు. జూలై 3 నుంచి జూలై 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ్టటౌఛఝఝట.ఛిజజ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు నం.040-23391067ను సంప్రదించొచ్చని తెలిపారు.

Updated Date - Jul 03 , 2026 | 07:16 AM