Share News

సరస్వతి అంత్య పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానం

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:48 AM

సరస్వతి అంత్య పుష్కరాలకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు ఆహ్వానం అందింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు లోక్‌భవన్‌లో ....

సరస్వతి అంత్య పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): సరస్వతి అంత్య పుష్కరాలకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు ఆహ్వానం అందింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7వ తేది వరకు, సరస్వతి అంత్య పుష్కరాలు ఈ ఏడాది మే 1 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. ఏర్పాట్ల గురించి గవర్నర్‌కు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు శైలజా రామయ్యర్‌ వివరించారు.

Updated Date - Apr 23 , 2026 | 04:48 AM