బ్రాహ్మణుల సంక్షేమానికి సర్కారు కృషి
ABN , Publish Date - May 15 , 2026 | 04:45 AM
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్....
మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
టీబీఎస్‌పీ చైర్మన్, వైస్‌చైర్మన్ ప్రమాణస్వీకారం
మన్సూరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్(టీబీఎస్‌పీ) చైర్మన్, వైస్‌చైర్మన్ల ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం నాగోల్ బండ్లగూడలోని వసంత్ విహార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. టీబీఎస్‌పీ చైర్మన్‌గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌తో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ప్రమాణస్వీకారం చేయించారు. బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీసెస్(బాస్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకునేందుకు పరిషత్ చొరవ చూపాలని ఆకాంక్షించారు. కాగా, బ్రాహ్మణ సమాజం గర్వించేలా పనిచేస్తానని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నూతన చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బ్రాహ్మణ పరిషత్ చైర్మన్‌గా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖకు బసవరాజు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.