Share News

‘ప్రాసిక్యూషన్‌’లో కాగితం రహిత పాలన

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:58 AM

తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌కు అనుగణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితం రహిత పాలనకు పలు విభాగాలు శ్రీకారం చుడుతున్నాయి.

‘ప్రాసిక్యూషన్‌’లో కాగితం రహిత పాలన

  • ఈ ఆఫీసు అప్లికేషన్‌ ప్రారంభించిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌కు అనుగణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితం రహిత పాలనకు పలు విభాగాలు శ్రీకారం చుడుతున్నాయి. ఈ క్రమంలో ప్రాసిక్యూషన్‌ డైరెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ ఆఫీసు అప్లికేషన్‌ వ్యవస్థను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌ శుక్రవారం ప్రారంభించారు. విభాగాధిపతుల క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా శుక్రవారం ప్రాసిక్యూషన్‌ డైరెక్టరేట్‌ను సందర్శించిన సీవీ ఆనంద్‌ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితం వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగణంగా అన్ని విభాగాలు సిద్ధం కావాలని కోరారు. ఈ ఆఫీసు విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:58 AM