Share News

జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:22 AM

రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం సోమవారం ప్రారంభమైంది. దాదాపు రెండు నెలల సెలవు అనంతరం విద్యాసంస్థలు తెరుచుకున్నాయి...

జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం సోమవారం ప్రారంభమైంది. దాదాపు రెండు నెలల సెలవు అనంతరం విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. తొలిసారి అన్ని జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ కాలేజీల్లో ఈ పథకం అమల్లోకి తెచ్చామని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. జూనియర్‌ కాలేజీల్లోనూ ఈ పథకాన్ని విస్తరించడంపై ఇంటర్‌ విద్య జేఏసీ హర్షం వ్యక్త చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, విద్యార్థులకు పౌష్ఠికాహారం లభిస్తుందన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 05:22 AM