Share News

దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్‌ విద్య

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:31 AM

రాష్ట్రప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ విద్యను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు.

దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్‌ విద్య

  • కరీంనగర్‌లో జిల్లాలో జూలై నుంచి ప్రవేశాలు: అడ్లూరి

ఓల్డ్‌మలక్‌పేట, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ విద్యను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. హెలెన్‌ కెల్లర్‌ 146వ జయంతి వేడుకలు శనివారం మలక్‌పేటలోని దివ్యాంగుల సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. హెలెన్‌ కెల్లర్‌ ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులకు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని, చూపులేని, వినినిడి లేని వారికి భావ విస్పోటనం ద్వారా ఈలోకాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దివ్యాంగుల కోసం నూతనంగా ఇంటర్‌ కళాశాలలు నెలకొల్పనున్నట్లు తెలిపారు. మొదట కరీంగనర్‌ జిల్లాలో జూలై నెలలో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తరువాత మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతాల్లో కళాశాలలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దివ్యాగుల సంక్షేమశాఖ సెక్రెటరీ అనితా రాంచంద్రన్‌, దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 03:32 AM