చిన్న తరహా ఖనిజ బ్లాకులకు ‘హైబ్రిడ్’ విధానం
ABN , Publish Date - May 12 , 2026 | 04:13 AM
గ్రానైట్, మార్బుల్ వంటి చిన్న తరహా ఖనిజ బ్లాకుల కేటాయింపునకు ‘హైబ్రిడ్’ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): గ్రానైట్, మార్బుల్ వంటి చిన్న తరహా ఖనిజ బ్లాకుల కేటాయింపునకు ‘హైబ్రిడ్’ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటిదాకా రెవెన్యూ, అటవీ తదితర శాఖల నుంచి అనుమతులు పొందిన తర్వాతే ప్రభుత్వ భూముల్లోని ఖనిజ బ్లాకులకు వేలం పాటలు నిర్వహించే వారు. ఇకపై అనుమతులు ఉన్నా, లేకున్నా.. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సర్వే ద్వారా గుర్తించిన అన్ని బ్లాకులకు టెండర్లను ఆహ్వానించేలా ‘హైబ్రిడ్’ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఆయా గనులు పట్టా భూముల్లో ఉన్నట్లయితే.. సంబంధిత యజమానికి సీనరేజీ ఫీజులో 10శాతం(గ్రానైట్, మార్బుల్‌కు సంబంధించి 5 శాతం) మొత్తాన్ని చెల్లించనున్నట్లు వివరించింది.