Share News

వాట్సాప్‌లోనూ ఇంటర్‌ ఫలితాలు!

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:25 AM

ఇంటర్‌ ఫలితాల ను వాట్సాప్‌లో ఏర్పాటు చేసిన మీసేవ చాట్‌బాట్‌ ద్వారా మన మొబైల్‌ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన సేవలను సచివాలయంలో ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు శనివారం ఆవిష్కరించారు.

వాట్సాప్‌లోనూ ఇంటర్‌ ఫలితాలు!

  • నేడు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు

  • రేపు దోస్త్‌ షెడ్యూల్‌..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల ను వాట్సాప్‌లో ఏర్పాటు చేసిన మీసేవ చాట్‌బాట్‌ ద్వారా మన మొబైల్‌ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన సేవలను సచివాలయంలో ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు శనివారం ఆవిష్కరించారు. ఆదివా రం వెలువడే ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను విద్యార్థులు ‘మీసేవ’ వాట్సాప్‌ సేవల ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చని మీసేవ కమిషనర్‌ రవికిరణ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. దానికోసం విద్యార్థులు 80969 58096 నంబరును ‘మీసేవ తెలంగాణ’ పేరుతో సేవ్‌ చేసుకుని, ఆ నంబరుకు వాట్సాప్‌ నుంచి హాయ్‌ అని మెసేజ్‌ పంపాలి. ఆ తర్వాత స్ర్కీన్‌పై ఇంటర్‌ ఫలితాల లింక్‌ను ఎంపిక చేసుకుని తమ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టినరోజు వివరాలను నమోదు చేస్తే క్షణాల్లో మీసేవ చాట్‌బాట్‌ ఫలితాలనందిస్తుంది. కాగా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలు విడుదల చేస్తారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ షెడ్యూల్‌ సోమవారం విడుదల చేయనున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 04:25 AM