Share News

రేపు ఇంటర్‌ ఫలితాలు!

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:40 AM

ఇంటర్‌ పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18తో ముగిశాయి.

రేపు ఇంటర్‌ ఫలితాలు!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18తో ముగిశాయి. సమాధాన పత్రాల మూల్యాంకనం గతనెలాఖరులోనే పూర్తయింది. అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై కేవలం ఒక సబ్జెక్టులో ఒకటి రెండు మార్కులతో ఫెయిలైన విద్యార్థుల సమాధానపత్రాలను ఈసారి మళ్లీ మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియ కూడా ఇటీవలే ముగిసింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి తీసుకుని ఫలితాలను ఈనెల 11న విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది ప్రథమ సంవత్సరం, 5,07,949 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.

Updated Date - Apr 10 , 2026 | 05:40 AM