Share News

‘యాంటీ డ్రగ్‌ అఫిడవిట్‌’ ఇస్తేనే ఇంటర్‌ అడ్మిషన్‌

ABN , Publish Date - May 14 , 2026 | 04:10 AM

ఈ ఏడాది ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలకునే విద్యార్థులు యాంటీ డ్రగ్‌ అఫిడవిట్‌ ఇవ్వాల్సిందే. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అన్ని కాలేజీలకు ఆదేశాలు జారీచేసింది.

‘యాంటీ డ్రగ్‌ అఫిడవిట్‌’ ఇస్తేనే ఇంటర్‌ అడ్మిషన్‌

హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలకునే విద్యార్థులు యాంటీ డ్రగ్‌ అఫిడవిట్‌ ఇవ్వాల్సిందే. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అన్ని కాలేజీలకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చేరే ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు దీనిపై సంతకం చేయాలి. అఫిడవిట్‌ను కోర్టు ఫీ స్టాంపు పేపర్‌పై చేయాల్సిన అవసరం లేదని, కేవలం ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచిన డిక్లరేషన్‌ ఫామ్‌పై సంతకం చేస్తే సరిపోతుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అభిలాష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 04:10 AM