Share News

సమాచారం ఇవ్వని అధికారులకు 5 వేల ఫైన్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 07:28 AM

నిర్దిష్ట కాల పరిమితిలోపు సమాచారం అందించని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్‌ రూ. 5 వేల చొప్పున జరిమానా విధించింది.

సమాచారం ఇవ్వని అధికారులకు 5 వేల ఫైన్‌

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : నిర్దిష్ట కాల పరిమితిలోపు సమాచారం అందించని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్‌ రూ. 5 వేల చొప్పున జరిమానా విధించింది. గ్రామ పంచాయతీ చేపట్టిన పనుల వివరాలు అందించాలని సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ నివాసి చీకోటి కనకవ్వ గ్రామ కార్యదర్శికి 2021లో దరఖాస్తు చేసుకున్నారు. సమాచారం అందించాలని 2022లో కమిషన్‌ తీర్పు చెప్పినా సమాచారం రాలేదు. బాధ్యుడైన పంచాయతీ కార్యదర్శికి రూ. 5 వేల జరిమానా విధిస్తూ సహ కమిషనర్‌ పీవీ.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిర్దిష్ట కాల పరిమితిలోపు సమాచారం ఇవ్వని నీటిపారుదల శాఖ, పురపాలక శాఖ అధికారులకూ రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు.

Updated Date - Feb 01 , 2026 | 07:28 AM